Sunday, July 14, 2013

చీమలు

ఆ విధంగా నేను US వెళ్ళాలి అన్నమాట.
నీకేంరా అదృష్టవంతుడివి... అమ్మ
జాగ్రత్తగా ఉండాలిరా. కొత్త దేశం, ప్రదేశం... నాన్న
అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా??... అన్నయ్య
enjoy చెయ్ మామా... స్నేహితులు
మాకేం తెస్తావ్... మా cousins
వీడి బాధ ఒక నాలుగు నెలలు వదులుతుంది... మా roommates
పని బాగా చెయ్యాలి... మా manager
మీ manager అలానే అంటాడు, నువ్వు work మాత్రమే కాకుండా అక్కడ బాగా తిరిగిరా... మా manager వాళ్ళావిడ
హమ్మయ్య.. ఒక నాలుగు నెలల పాటు చీమలు ఉండవు... నేను

అంతే కదా మరి శత్రువులని కుడా పెద్దగా అసహ్యించుకొని నేను, ఈ లోకంలో వేటినైనా అసహ్యించుకుంటాను అంటే అది చీమలు మాత్రమే. అసలు చిన్నప్పటి నుంచి నాకు చీమలు అంటే కోపమే. అదేంటో కుట్టేస్తూ ఉంటాయి. కొంచెం గుడ్డిలో మెల్ల ఏంటి అంటే నల్ల చీమలు. ఇవి ఆ ఎర్ర చీమలు లాగా కుట్టకపోయినా చక్కలిగిలి పెట్టినట్టు పాకేసినా, ఇవి కూడా చీమలే. ఆ ఒక్క కారణం చాలు నాకు నచ్చకపోటానికి.

అసలు అపాయానికి గుర్తుగా ఎరుపు రంగుని ఈ చీమల్ని చూసే పెట్టి ఉంటారు. వాటికి ఆడ, మగ, కులం, గోత్రం ఏమి అవసరం లేదు. ఒక ప్రాణి అయితే చాలు కుట్టేస్తాయి. అరే, కొంచం కుడా కనికరం ఉండవండి. నిజం. అడవిలో జంతువులు కుడా వాటికి ఆహారం అవసరం అయితేనే వేరే జంతువులని పీక్కు తింటాయి అంట. మరి చీమలో వాటికి మన ఆహారం కావాలి, మళ్ళి మనల్నే కుడతాయి. అయినా పాలు తాగి విషం కక్కుతుంది అని పాముల్ని అంటాం కానీ, చీమలు మాత్రం ఏం తక్కువండి?? పైగా చీమలన్నీ కలిసి పామునే తినగలవు అంట.

నాకు కొత్త camera giftగా వచ్చింది. Latest SLR model అంట, మొట్ట మొదటగా చీమల్ని వస్తువుగా తీసుకొని ఫోటోలు తీయటం నేర్చుకుందాం అనుకుంటున్నా... మా స్నేహితురాలు. ఏమ్మా, నీకు అంతకంటే మంచి వస్తువు ఏమి దొరకలేదా?? చిన్న చిన్న పూలు తీసుకో, బయట జనాల్ని తీసుకో, కొండల్ని కోనల్ని తీసుకో, అంతగా కాకపోతే మీ bossని తీసుకో.. మరీ చీమల్నా?? అంతకన్నా బుద్ది తక్కువ పని ఇంకోటి ఉండదు. గుర్తు పెట్టుకో, అవి బాగా ఫొస్ ఇస్తాయి అని మాత్రమే అనుకుంటే తప్పు. నిన్ను కుడతాయి కుడా. అసలు శివుడాజ్ఞ లేనిదే చీమైనా కదలదు అన్న సామెతని బట్టే మీకు తెలియాలి, చీమ పురాణాల కాలం నుంచి మనుష్యులని కుడతానే ఉంది అని.

మనం కొంచం frankగా మాట్లాడుకుందాం అండి. ఒక sweet డబ్బా గదిలో పెట్టడంలో తప్పేంటండి. మనం కష్టపడి డబ్బులు సంపాదించుకొని, నాలుగు కొట్లలో enquiry చేసి, ఒక కొట్లో అప్పుడే చేసిన మైసూర్ పాక్ ఒక కేజి కొనుక్కొని ఒక ముక్క తిని అలా స్నానానికి వెళ్లి వస్తామో లేదో, ఆ డబ్బా మొత్తం చీమలకు అర్పితం. వాటికి అసలు కష్టపడి ఆహారం సంపాదించుకొనే తత్వమే లేదండీ. ఎవడు ఎప్పుడు బెల్లం కొంటాడా, ఎవడు ఎప్పుడు sweets కొంటాడా, దీపావళికి ఈ ఇంట్లో పని చేసే వాడికి, ఆఫీసులో sweets box or chocolates box ఇస్తారా? ఎప్పుడూ ఇవే ఆలోచనలు వాటికి. మీ ఆఫీసులో sweets ఇవ్వకపోతే మీరు బాధ పడతారో లేదో తెలియదు కానీ, మీ ఇంట్లో చీమలు మాత్రం కచ్చితంగా బాధ పడతాయి.

ఆగిపోయిన ఘడియారం కుడా రోజుకి రెండు సార్లు సరైన సమయాన్ని చూపిస్తుంది అంట. అలానే చీమలు కుడా కొన్ని సార్లు ఉపయోగపడతాయి. ఉదాహరణకి,
  • మీరు పిల్ల జమిందారు సినిమా చూసారా? అందులో మాష్టార్లు అందరూ కలిసి అమ్మాయిల్ని ఏడిపిస్తున్న ఒక అబ్బాయికి గుణపాటం చెప్పటానికి వాడి pantsలో తేనె పోసి, చీమల పుట్ట దగ్గర వదిలేద్దాం అంటారు. అలా.
  • ఇంకా సింహాద్రి సినిమాలో మన రస్నా పాప అంకిత NTRని ప్రేమలో పడెయ్యటానికి చీమని వాడుకుంటుంది. అలా.
  • అతి ముఖ్యమైన ఉపయోగం ఏంటి అంటే, Gamaxin తాయారు చేసే industriesని పెట్టుకునే వీలు కలిగించి ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తుంది. అలా.

అంతకంటే పెద్ద ఉపయోగం ఏమి ఉండదంటే నమ్మండి. మా ఉళ్ళో 30 అంతస్తుల భవంతి ఒకటి కట్టారు అంట. ఆ విషయం మా roommate చెప్పగానే నాకు అన్నిటికంటే ముందు వచ్చిన ఆలోచన ఏంటి అంటే, అంత ఎత్తు చీమలు పాకగాలవా? అక్కడ ఉంటే చీమల బాధ తప్పుతుందా అని. మీరేమంటారు?

Tuesday, January 31, 2012

నేను నా చెల్లి


నేను, నా చెల్లెలు.. మేము ఇద్దరమే ఉంటాము. మాకు ఎవ్వరూ లేరు. నాన్న మిలటరీలో పని చేస్తూ కార్య నిర్వహణలో ప్రాణాలు వదిలారు. అప్పటి నుంచి నా చెల్లికి అన్నీ నేనై చూసుకుంటూ ఉండేవాడిని. నా చెల్లెలంటే నాకు ఎంత ఇష్టమో మీకు తెలియదు కదా. నాకు బోలెడంత ఇష్టం. తనకు జన్మనిస్తూ మా అమ్మ తన ప్రాణాన్ని మా చెల్లెలిలో వదిలేసి వెళ్ళింది. నాకు అమ్మైనా, చెల్లైన తనే. 



ఆ రోజు బడి నుంచి తిరిగివస్తూ(నేను ఆరోవ తరగతి, తను నల్గోవ తరగతి) నా చెల్లి నాతో 'అన్నా.. నాకు నాన్న పని చేసిన చోటు చూడాలని ఉంది' అన్నది. 'అన్నా నాకు చాక్లేటు కొన్నిపెట్టు' అంటే నేను కొనిపెట్టగలను కానీ నాన్న పని చేసిన చోటు చూపించమంటే నేనెలా తీసుకెళ్ళగలను??? కానీ అడిగింది నా చెల్లి.. తన మాట నేనెప్పుడైనా కాదన్నానా?? కనీసం సాయం చెయ్యటానికి భందువులు కూడా ఎవ్వరూ లేరు. మాకు తెలిసిన ఒకే ఒక్క పెద్ద దిక్కు నాన్న స్నేహితుడు, సహోద్యోగి అయిన మిలిటరి మావయ్య.. అవును మరి ఎప్పుడు మా దగ్గరకి వచ్చినా మేము మావయ్యా అని పిలుస్తామే కానీ పేరు తెలియదాయె. మరి ఇప్పుడు ఎలా?? ఎవరిని అడగాలి?? అని ఆలోచిస్తుండగా నాకు నాన్న personal diary దొరికింది. తెరిచి చూస్తే అన్నీ వివరాలు అందులో ఉన్నాయి. నాన్న పనిచేసిన చోటు, చిరునామా. నాన్న మమ్మల్ని ఎంత ఇష్టపడే వారో ఆ dairyని చదివితే తెలుస్తుంది. మేమంటే ఆయనకు పంచ ప్రాణాలు. ఇంక మరుసటి రోజునే నేను చెల్లిని తీసుకొని బయలుదేరాను... నా దగ్గర ఉన్న కొంచం డబ్బులు తీసుకొని, సంచిలో తినటానికి కొన్ని, చేరి రెండు జతల బట్టలు పెట్టుకొని మేము ఇద్దరం 'little soldiers' లాగా బయలుదేరాము. ఒక్కటే లక్ష్యం. ఎలాగైనా నాన్న పని చేసిన చోటు చూడాలి. తన కుర్చీలో చెల్లిని ఒక సారి కుర్చోబెట్టాలి. చెల్లి కళ్ళల్లో ఆనందం చూడాలి.

ఇంక దారిలో ఉహించిన విధంగానే ప్రమాదాలు, అవాంతరాలు. ఒక సారి దాదాపుగా చెల్లి తప్పిపోయి ఉండేది. ఆ బస్సు driver సహాయంతో ప్రమాదం తప్పింది. ఇంకొక చోట మా దగ్గర ఉన్న డబ్బులు అయిపోతే ఏం చెయ్యాలో తెలియని స్థితిలో, చెల్లికి ఆహారం కూడా కొనలేకపోతాను. అప్పుడు నా పక్కన ఉన్న పెద్దాయన్ని చూస్తే తను మాకంటే దిగులు చెంది ఉన్నట్లు కనిపించింది. ఎందుకో పాపం! ఆయన మా పరిస్థితి విని మాకు డబ్బులు ఇవ్వబోతే నేను తీసుకోలేదు. అయన పట్టు విడవలేదు. సరే ముందు అయన ఎందుకు భాద పడుతున్నాడో అని అడగగా తన సమస్య నాకు చిన్నదిగా కనిపించింది. తన వ్యాపారం మళ్ళి బాగుపడాలి అంటే ఏం చెయ్యాలో ఆయనకి ఒక చిట్కా చెప్పను.(కొన్ని సార్లు అంతే చిన్న చిన్న విషయాలు మనం ఎంతగా పరిగణలోకి తీసుకోమో ఇలాంటి విషయాల వల్ల తెలుస్తుంది) ఆయనకు ఆ చిట్కా నచ్చి మమ్మల్ని మెచ్చి మాకు remuneration ఇచ్చాడు. ఒకరికొకరం all the best చెప్పుకొని వీడ్కోలు తీసుకున్నాం. అలా ఎన్నో సమస్యలు, భాదలు పడుతూ చివరికి నేను చెల్లిని నాన్న పనిచేసిన చోటికి తీసుకెళ్ళగలిగాను. ఆఫీసు పరిసరాల్లో మిలటరీ మావయ్య కనిపించటంతో మా పని సులువుగా అయ్యింది. ఆ రోజు చెల్లి మోహంలో చుసిన ఆనందం నాకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. 

ఇదీ నాకు ఇవాళ వచ్చిన కల. It shows how badly I miss my little sister. 
నిజానికి నాకు చెల్లెలు లేదు. నేను మా అన్నయ్య. ఈ అమ్మాయి నా cousin. ఇలా నాకు ఒక చెల్లి ఉంది అని నాకు తెలిసింది ఎప్పుడో తెలుసా?? నేను engineering మూడోవ సంవత్సరంలో ఉన్నప్పుడు. పరిచయమయ్యిన కొన్ని రోజులకే మేము ఎన్నో రోజులనుంచి పరిచయం ఉన్న వాళ్ళ లాగా తయారయ్యాం... Hutch వాడి పుణ్యమాని రోజుకు ఒక్క రూపాయితో free sms option ఉండే రోజులవి. ఇంకేముంది, తు అంటే sms న అంటే sms :) మేము అవ్వటానికి భందువులమే అయినా స్నేహితులు లాగా ఉంటాము. తర్వాత తర్వాత నా స్నేహితులు తన స్నేహితులు అయ్యారు. తన స్నేహితులు నా స్నేహితులు అయ్యారు. అక్కడ cut చేస్తే తను MBA చెయ్యటానికి హైదరాబాదు రావటం, నేను ఉద్యోగానికి అదే ఊరు రావటం జరిగింది. ఇంకేముంది, మీరు ఉహించేదే. weekendsకి సినిమాలు. బోర్ కొడితే long driveలు. సొంత అన్నా చెల్లెళ్ళ లాగా ఉంటాము. And then comes the inevitable. తన MBA course అయిపొయింది. ఇంటికి వెళ్ళిపోయింది. వాఆఆఆఅ :(

నేను చెన్నై వచ్చాను. మరీ చెల్లి దూరమైందని మందు కొడితే బాగోదు అని సాంబారు తాగుతూ బతికేస్తున్నాను. :) అప్పడప్పుడు వీలు చూసుకొని చిన్న చిన్న trips వేసుకుంటాము. అలా ఒక సారి మహాబలిపురం వెళ్తే.. ఇంకో సారి భద్రాచలం వెళ్ళాము. కానీ మా చిన్ని చిన్ని పోట్లాటలు, సరదా సరదా ప్రయాణాలు, చక్కని సంభాషణలు, నాకు అన్నం తినిపించిన సమయాలు, Dairymilk Silk కొనిపెడితే తన కళ్ళల్లోని ఆనందం ఇలాంటి ఎన్నో జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికి, ఎప్పటికీ పదిలంగా ఉంటాయి.

ఇంతకీ మీకు తన పేరు చెప్పలేదు కదా... సంపూర్ణ... సంపూర్ణ లక్ష్మీ.
ఊరు- విశాఖపట్నం.

Thursday, January 5, 2012

Immortals of Meluha


శివుడు. రుద్రుడు. మహదేవుడు. వీరంతా ఒకరేనా?? అవతారాలా??

ఒక మనిషి తన ఖర్మను అనుసరించి నడిచిన దారి తనను మహదేవునిగా ఎలా నిలిపింది అన్నదే ఈ పుస్తకంలో చూపించబడుతుంది. పుస్తకం మొత్తం ఒక సాధారణ తెలుగు సినిమాలాగా ఉంటుంది. చదువుతున్న కొద్ది తర్వాత ఏం జరుగుతుందో తెలిసిపోతూనే ఉంటుంది. అయినా కూడా ఎక్కడ నిరుత్సాహం ఉండదు. ఒక్కొక్క పేజి తిప్పుతున్న కొద్ది తర్వాత ఏం జరుగుతుంది అన్న ఆత్రుత పాఠకుడిలో ఉంటుంది.

హిమాలయాల్లో ఉన్న Gunas అనే ఒక తెగ(Tribe)కి అధిపతి మన సినిమాలో హీరో - Shiva. తన చిన్ననాటి నేస్తం, కుడి భుజం - Bhadra. వీరు Mount Kailash పరిసరాల్లో ఉంటారు. ఒకానొక రోజున Meluha అనే రాజ్యం నుంచి Captain Nandi విరి దగ్గరకి వచ్చి తమ రాజ్యానికి(Immigrantsగా) రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాడు. అప్పటికే హిమాలయాల్లో ఉన్న వేరే తెగ నుంచి పలు మార్లు దాడికి గురవుతున్న Gunas కూడా Meluhaకి వెళ్ళిపోదామనే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతారు. సాధారణంగా తమ తెగకి సంభందించిన ఏ నిర్ణయం అయినా ఆ తెగ అధిపతి  తీసుకుంటాడు. కానీ ఈ విషయంలో శివుడు నిర్ణయాన్ని తన ప్రజలకే వదిలేస్తాడు. ఇటువంటి చిన్న విషయంలో కూడా ఒక నాయకుడుకి ఎలాంటి లక్షణాలు ఉండాలి? తన స్వప్రయోజనం కంటే తన ప్రజలు తనకి ఎంత ముఖ్యమో రచయత చక్కగా వివరిస్తాడు. 

ఇక అక్కడి నుంచి Gunas Meluhaకి బయలుదేరుతారు. దారిలో వారిపై పాత శత్రువులు దాడి చేయగా Gunasతో పాటు Captain Nandi and Team కూడా విరోచితంగా పోరాడి శత్రువులను తరిమేస్తారు. అలా శివుడికి కొంచం కొంచంగా Meluha ప్రజల మీద సదాభిప్రాయం కలగడం మొదలవుతుంది. Meluha చేరిన తర్వాత శివుడికి, వారి తెగ ప్రజలకి అక్కడ ఉన్న ప్రతీది వింతగానే గోచరిస్తుంది. Meluha ప్రజలు తమకంటే ఎంతో అభివృద్ది చెంది ఉంటారు. సుచి, శుభ్రత, ఆహార అలవాట్లు, వినయ విధేయతలు, సంస్కారం ఏ ఒక్క విషయలో కూడా వీరు వెనకబడి ఉన్నట్లు కనిపించరు. వారి నివాస గృహాలు ఒక గొప్ప వింతగా గోచరిస్తాయి. తమ రాజ్యంలోకి వచ్చిన సాధారణ Immigrantsకి ఇస్తున్న గౌరవం చూసి Gunas అబ్బుర పడుతూ ఉంటారు. తమకి ఇన్ని మర్యాదలు ఎందుకు చేస్తున్నారో అర్ధం కానీ శివుడుకి, భద్రుడికి, మిగతా ప్రజలకి తెలిసేది ఏమిటి అంటే Meluha ప్రజలు అందరిని అలానే అతిధి మర్యాదలతో సత్కరిస్తారు. Gunasకి ఇచ్చిన వసతి గృహానికి వైద్యురాలు Ayurvathi. వచ్చిన మొదటి రోజు రాత్రికి Gunas అందరికీ జ్వరం వస్తుంది. అప్పటిదాకా చక్కగా భోగాలు అనుభవించిన వారు ఒక్కసారిగా జబ్బు పడతారు. శివుడుకి తీవ్రమైన చమట పోస్తుంది. కొంచం సేపు కదలలేక పోతాడు. ఒక్క సారిగా భయాందోళణలు చుట్టుముడతాయి. ఏమవుతుందో ఎవ్వరికి అర్ధం అవ్వదు. 

కొన్ని నిమిషాలకి తేరుకున్న శివుడు వెంటనే పరుగు పరుగున ఆయుర్వతి దగ్గరకి బయలుదేరుతాడు. విషయం విన్న ఆయుర్వతి తన నర్సులకు 'మొదలయ్యింది. వెంటనే వెళ్లి వాళ్ళకు వైద్యం చెయ్యండి' అంటుంది. అంటే జ్వరం వస్తుంది అని ఆయుర్వతికి ముందే తెలుసా? కావాలనే మాకు ఇచ్చిన ఆహారంలో ఏమైనా కలిపారా? నమ్మించి మమ్మల్ని మోసం చేసారా? ఇలాంటి ప్రశ్నలు శివుడిని చుట్టుముట్టినా కూడా ఇది సరైన సమయం కాదు చర్చించటానికి అని చెప్పి మౌనంగా ఉంటాడు. Gunas అందరూ జబ్బు పడినా కూడా శివుడు ఆరోగ్యంగానే ఉండటం అయుర్వతికి అవగతం అవ్వదు. నర్సులు అందరు వెనువెంటనే ఆయుర్వతి పర్యవేక్షణలో  వైద్యం ఆరంభిస్తారు. నేను కూడా ఏమైనా సహాయం చెయ్యనా అని అయుర్వతిని శివుడు అడగగా 'వెంటనే వెళ్లి స్నానం చెయ్యండి. మీ శరీరపు చమట ఇక్కడ ఉన్న వారికి ప్రమాదకరం' అని సమాధానం వస్తుంది. చమట ప్రమాదకరం ఎలా అవుతుందో అర్ధం కానీ శివుడికి మరింత కోపం వస్తుంది. తనకి తెలియకుండా ఏదో జరుగుతుంది అని విషయం ఏంటో తనకి చెప్పాలని మొండికేస్తాడు. ఇది చర్చించే సమయం కాదు అని.. అంత మీ మంచికే జరుగుతుంది అని చెప్పి తన పనిలోకి నిమగ్నమవుతుంది ఆయుర్వతి. విషయం అర్ధం కాక పోయినా వీళ్ళను నమ్మవచ్చు అని శివుడు తన గదికి వెళ్లి స్నానం చేసి కూర్చుంటాడు. విషయం తెలుసుకున్న నంది కూడా Gunas ఉండే వసతి గృహానికి వస్తాడు. వైద్య సిబ్బంది అందరికీ వైద్య సహాయాలు అందించగా మెల్లగా Gunas అందరు కోలుకుంటూ ఉంటారు. పని ముంగించుకొని అందరి కులాసా విషయం శివునికి చెప్పటానికి ఆయుర్వతి, నంది వెళ్లగా శివుని చూసి నిశ్చేష్టులు అవుతారు. కారణం ఎదురుగా నీలకంఠుడు వారికి దర్శనం ఇస్తాడు. అశ్రు నయనాలతో ఇద్దరు శివుని ముందు మోకరిల్లి ' నీలకంఠా!!! మీకోసమేనయ్యా మేము ఇన్నేళ్ళ నుంచి వేచి చూస్తున్నాం. ఇన్నాళ్ళకు మా కష్టాలు గట్టేక్కయి. మీరే మాకు మార్గ నిర్దేశం చెయ్యాలి' అంటారు. వారు ఎందుకు ఏడుస్తున్నారో, ఎందుకు తనని చూసి నీలకంఠుడు అంటున్నారో, వారికి నేనేం చెయ్యగలనో అర్ధం కాక దిక్కులు చూస్తూ అద్దంలోకి చుసిన శివుడు తన కంఠం నీలంగా మారిపోవటం గమనిస్తాడు. 

అప్పటి మొదలు శివుడిని నీలకంఠుడిగా అందరూ కొలవటం, కాలికి మొక్కటం మొదలుపెడతారు. విషయం ఏమిటంటే  Meluhaలో ఉన్న ప్రజలు సూర్య వంశులు. వారిని కాపాడటానికి వచ్చే వాడు నీలకంఠుడు అని వారి Legends చెప్తాయి. అలా వచ్చే నీలకంఠుడు  సూర్య వంశుడు కాడు అని కూడా చెప్తాయి. అందువలన నీలకంఠుని వెతకటానికి Meluha చుట్టుపక్కల ఉండే వారిని Immigrantsగా తమ రాజ్యంలోకి ఆహ్వానిస్తారు. నీలకంఠుడు తమ నగరంలో(Srinagar) దర్శనం ఇచ్చాడు అని తెలుసుకున్న Srinagar's Governor వెంటనే Meluha Emperor His Highness Daksha(దక్షుడు)కి సమాచారం అందచేస్తాడు. వెంటనే నీలకంఠుని తన వద్దకు తీసుకురావాల్సిందిగా, తను నిర్దారించేవరకు ఎవ్వరికి నీలకంఠుని గురించి చెప్ప కూడదు అనినీలకంఠుని కంఠానికి cravat(something similar to scarf) కట్టి తీసుకురావాల్సిందిగా దక్షుని నుంచి సమాధానం వస్తుంది. పైగా నీలకంఠునికి Legend గురించి ఏమి చెప్పకూడదు అని కూడా అంటాడు దక్షుడు. Captain Nandi తోడుగా శివుడు Meluha రాజధాని 'దేవగిరి'కి బయలుదేరుతాడు. దారిలో వారి స్నేహం మరింత ధృడ పడుతుంది. వెళ్ళే తోవలో ఒక చోట వారు బస చెయ్యగా ఆ రోజు సాయంత్రం చుట్టూ పక్కల చూసి వస్తాను అని వెళ్ళిన శివుడు ఒక గుడిలోకి వెళ్తున్న Princess Satiని చూస్తాడు. దక్షుని కుమార్తె. మొదటి చూపులోనే శివుడు సతిని చూసి ప్రేమిస్తాడు. సతిని అనుసరిస్తూ గుడిలోకి వెళ్తాడు. బయటకు వస్తున్న సతి మీద దాడి జరుగుతుంది. శివుడు తన presence of mindతో ఆపదను ముందే పసిగట్టి తనకి చినప్పటి నుంచి వెన్నతో పెట్టిన కత్తి విద్యతో శత్రువులతో పోరాడి సతిని కాపాడతాడు. తనకి ప్రాణ దానం చేసిన శివుడికి మనఃపూర్వక కృతజ్ఞతలు చెప్పి తన వివరాలు ఇచ్చి శివునకు ఏమైనా సహాయం కావాలంటే 'దేవగిరి'లో తన వద్దకు రావొచ్చు అని చెప్పి సతి తన చెలికత్తె కృత్తికతో పటు వెళ్ళిపోతుంది. 

సతి గురించి తప్ప మిగిలిన విషయం శివుడు నందికి వివరించగా కోపంతో నంది ఊగిపోతాడు. దాడి చేసిన వారు చంద్ర వంశులు అని, వారు వెలి వేయబడ్డ Nagasతో పాటు Meluhaలో Terrorist activitiesకి పాల్పడుతున్నారు అని నంది వివరిస్తాడు. వారు ఎప్పుడు కూడా ఇలానే సైన్యం లేని public placesలో దాడులకి దిగుతారు అని, సైన్యం వచ్చేలోపు వెళ్ళిపోతారు అని వాళ్ళని ఆపడం తమ వల్ల కావడం లేదు అని, ఎలాగైనా మీరే మమ్మల్ని ఆ దుష్టులైన చంద్ర వంశుల నుంచి కాపాడాలని అబ్యర్ధిస్తాడు. శివుడు తన వల్ల చెయ్యగలిగిన సహాయం చేస్తాను అని చెప్తాడు గానీ తనకి ఏం చెయ్యాలో తెలియదు. అలా ప్రయాణించి రెండు ముడు రోజుల్లో నంది, శివుడు దేవగిరికి చేరుకుంటారు. ఈ కొంత సమయంలో నంది వయస్సు వంద సంవత్సరాలకు పైగా ఉంటుంది అని శివుడు గ్రహిస్తాడు. అంతే కాకుండా ఆ రాజ్యంలో ఎవ్వరు కూడా ముసలితనంతో కనిపించరు. కోటకి చేరిన శివుడు అక్కడ ఉన్న Organized system of ruling చూసి నివ్వెర పోతాడు. అంత బాగా అభివృద్ధి చెందిన ఆ రాజ్యంలో ఇలా Terrorist activities జరగడం ఏంటి? తను నిజంగా వీళ్ళను కాపాడగలడా? లాంటి ప్రశ్నలు శివుని మదిలో ఉంటాయి. రాజు దక్షుని సమక్షానికి చేరుకున్న శివుడుకి రాజు ఏం చెప్తాడు? Legend ఏం చెప్తుంది? మొదటి రోజు Gunasకి జ్వరం ఎందుకు వస్తుంది? శివునికి నీలకంఠం ఎలా వస్తుందిశివుడు దుష్టులైన చంద్ర వంశులను జయిస్తాడా? అస్సలు నిజంగానే వారు దుష్టులా? ఆ ప్రయత్నలో శివుడికి ఆ రాజ్యపు chief scientist బృహస్పతి ఎలా పరిచయం అవుతాడు? శివుడు కేవలం మనిషి మాత్రమే తనకి అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు అని నమ్మిన Meluha సైన్యధిపతి Parvatheswar నమ్మకం నిజమవుతుందా? పెళ్ళి చేసుకోవటానికి అర్హత లేని సతి ప్రేమను శివుడు జయిస్తాడా?? నిజంగానే Meluhaలో ఉన్న ప్రజలు Immortals-?? ఇవన్నీ పుస్తకం చదివి తెలుసుకోవాల్సిందే...

ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చినవి చక్కటి సంభాషణలు. ముఖ్యంగా శివునికి గుడిలో ఉండే పండితులకి(Pandits of Brahma) మధ్య జరిగే సంభాషణలు ఈ పుస్తకనికే Highlightగా నిలుస్తాయి. ఇంకా Meluhaలో ఉండే కొన్ని ప్రక్రియలను(systems) మనం మెచ్చుకోకుండా ఉండలేము. Maika system వంటివి అములు చేస్తే మనం నిత్యం వినే 'Protest against Reservation' అవసరమే లేకుండా పోతుంది. శివున్ని ప్రేమించటానికి తనకు అర్హత లేదు అని తెలిసీ, అతని మీద ప్రేమను పెంచుకున్న సతి తనను తాను భూమిగా పోల్చుకొని శివున్ని సూర్యునిగా పోల్చి జరిపిన సంభాషణ ఎన్ని సార్లు చదివినా మళ్ళి చదవాలి అనిపిస్తుంది.  పాఠకుని మనస్సుకి నచ్చే చక్కటి వివరణ ఈ పుస్తకంలో కనిపిస్తుంది. చివరగా ఈ పుస్తక త్రయం(Shiva Trilogy)లో రెండో పుస్తకం - The Secrets of the Nagas కొని చదివే దాకా ప్రశాంతంగా ఉండలేము అనిపిస్తుంది. చివరిదైన మూడోవ పుస్తకం(The oath of Vayuputhras) ఇంకా వెలువడలేదు. 

పుస్తకం వెల: Rs. 195
flipkart లో వెల: Rs. 127