Sunday, July 14, 2013

చీమలు

ఆ విధంగా నేను US వెళ్ళాలి అన్నమాట.
నీకేంరా అదృష్టవంతుడివి... అమ్మ
జాగ్రత్తగా ఉండాలిరా. కొత్త దేశం, ప్రదేశం... నాన్న
అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా??... అన్నయ్య
enjoy చెయ్ మామా... స్నేహితులు
మాకేం తెస్తావ్... మా cousins
వీడి బాధ ఒక నాలుగు నెలలు వదులుతుంది... మా roommates
పని బాగా చెయ్యాలి... మా manager
మీ manager అలానే అంటాడు, నువ్వు work మాత్రమే కాకుండా అక్కడ బాగా తిరిగిరా... మా manager వాళ్ళావిడ
హమ్మయ్య.. ఒక నాలుగు నెలల పాటు చీమలు ఉండవు... నేను

అంతే కదా మరి శత్రువులని కుడా పెద్దగా అసహ్యించుకొని నేను, ఈ లోకంలో వేటినైనా అసహ్యించుకుంటాను అంటే అది చీమలు మాత్రమే. అసలు చిన్నప్పటి నుంచి నాకు చీమలు అంటే కోపమే. అదేంటో కుట్టేస్తూ ఉంటాయి. కొంచెం గుడ్డిలో మెల్ల ఏంటి అంటే నల్ల చీమలు. ఇవి ఆ ఎర్ర చీమలు లాగా కుట్టకపోయినా చక్కలిగిలి పెట్టినట్టు పాకేసినా, ఇవి కూడా చీమలే. ఆ ఒక్క కారణం చాలు నాకు నచ్చకపోటానికి.

అసలు అపాయానికి గుర్తుగా ఎరుపు రంగుని ఈ చీమల్ని చూసే పెట్టి ఉంటారు. వాటికి ఆడ, మగ, కులం, గోత్రం ఏమి అవసరం లేదు. ఒక ప్రాణి అయితే చాలు కుట్టేస్తాయి. అరే, కొంచం కుడా కనికరం ఉండవండి. నిజం. అడవిలో జంతువులు కుడా వాటికి ఆహారం అవసరం అయితేనే వేరే జంతువులని పీక్కు తింటాయి అంట. మరి చీమలో వాటికి మన ఆహారం కావాలి, మళ్ళి మనల్నే కుడతాయి. అయినా పాలు తాగి విషం కక్కుతుంది అని పాముల్ని అంటాం కానీ, చీమలు మాత్రం ఏం తక్కువండి?? పైగా చీమలన్నీ కలిసి పామునే తినగలవు అంట.

నాకు కొత్త camera giftగా వచ్చింది. Latest SLR model అంట, మొట్ట మొదటగా చీమల్ని వస్తువుగా తీసుకొని ఫోటోలు తీయటం నేర్చుకుందాం అనుకుంటున్నా... మా స్నేహితురాలు. ఏమ్మా, నీకు అంతకంటే మంచి వస్తువు ఏమి దొరకలేదా?? చిన్న చిన్న పూలు తీసుకో, బయట జనాల్ని తీసుకో, కొండల్ని కోనల్ని తీసుకో, అంతగా కాకపోతే మీ bossని తీసుకో.. మరీ చీమల్నా?? అంతకన్నా బుద్ది తక్కువ పని ఇంకోటి ఉండదు. గుర్తు పెట్టుకో, అవి బాగా ఫొస్ ఇస్తాయి అని మాత్రమే అనుకుంటే తప్పు. నిన్ను కుడతాయి కుడా. అసలు శివుడాజ్ఞ లేనిదే చీమైనా కదలదు అన్న సామెతని బట్టే మీకు తెలియాలి, చీమ పురాణాల కాలం నుంచి మనుష్యులని కుడతానే ఉంది అని.

మనం కొంచం frankగా మాట్లాడుకుందాం అండి. ఒక sweet డబ్బా గదిలో పెట్టడంలో తప్పేంటండి. మనం కష్టపడి డబ్బులు సంపాదించుకొని, నాలుగు కొట్లలో enquiry చేసి, ఒక కొట్లో అప్పుడే చేసిన మైసూర్ పాక్ ఒక కేజి కొనుక్కొని ఒక ముక్క తిని అలా స్నానానికి వెళ్లి వస్తామో లేదో, ఆ డబ్బా మొత్తం చీమలకు అర్పితం. వాటికి అసలు కష్టపడి ఆహారం సంపాదించుకొనే తత్వమే లేదండీ. ఎవడు ఎప్పుడు బెల్లం కొంటాడా, ఎవడు ఎప్పుడు sweets కొంటాడా, దీపావళికి ఈ ఇంట్లో పని చేసే వాడికి, ఆఫీసులో sweets box or chocolates box ఇస్తారా? ఎప్పుడూ ఇవే ఆలోచనలు వాటికి. మీ ఆఫీసులో sweets ఇవ్వకపోతే మీరు బాధ పడతారో లేదో తెలియదు కానీ, మీ ఇంట్లో చీమలు మాత్రం కచ్చితంగా బాధ పడతాయి.

ఆగిపోయిన ఘడియారం కుడా రోజుకి రెండు సార్లు సరైన సమయాన్ని చూపిస్తుంది అంట. అలానే చీమలు కుడా కొన్ని సార్లు ఉపయోగపడతాయి. ఉదాహరణకి,
  • మీరు పిల్ల జమిందారు సినిమా చూసారా? అందులో మాష్టార్లు అందరూ కలిసి అమ్మాయిల్ని ఏడిపిస్తున్న ఒక అబ్బాయికి గుణపాటం చెప్పటానికి వాడి pantsలో తేనె పోసి, చీమల పుట్ట దగ్గర వదిలేద్దాం అంటారు. అలా.
  • ఇంకా సింహాద్రి సినిమాలో మన రస్నా పాప అంకిత NTRని ప్రేమలో పడెయ్యటానికి చీమని వాడుకుంటుంది. అలా.
  • అతి ముఖ్యమైన ఉపయోగం ఏంటి అంటే, Gamaxin తాయారు చేసే industriesని పెట్టుకునే వీలు కలిగించి ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తుంది. అలా.

అంతకంటే పెద్ద ఉపయోగం ఏమి ఉండదంటే నమ్మండి. మా ఉళ్ళో 30 అంతస్తుల భవంతి ఒకటి కట్టారు అంట. ఆ విషయం మా roommate చెప్పగానే నాకు అన్నిటికంటే ముందు వచ్చిన ఆలోచన ఏంటి అంటే, అంత ఎత్తు చీమలు పాకగాలవా? అక్కడ ఉంటే చీమల బాధ తప్పుతుందా అని. మీరేమంటారు?