నేను, నా చెల్లెలు.. మేము ఇద్దరమే ఉంటాము. మాకు ఎవ్వరూ లేరు. నాన్న మిలటరీలో పని చేస్తూ కార్య నిర్వహణలో ప్రాణాలు వదిలారు. అప్పటి నుంచి నా చెల్లికి అన్నీ నేనై చూసుకుంటూ ఉండేవాడిని. నా చెల్లెలంటే నాకు ఎంత ఇష్టమో మీకు తెలియదు కదా. నాకు బోలెడంత ఇష్టం. తనకు జన్మనిస్తూ మా అమ్మ తన ప్రాణాన్ని మా చెల్లెలిలో వదిలేసి వెళ్ళింది. నాకు అమ్మైనా, చెల్లైన తనే.
ఆ రోజు బడి నుంచి తిరిగివస్తూ(నేను ఆరోవ తరగతి, తను నల్గోవ తరగతి) నా చెల్లి నాతో 'అన్నా.. నాకు నాన్న పని చేసిన చోటు చూడాలని ఉంది' అన్నది. 'అన్నా నాకు చాక్లేటు కొన్నిపెట్టు' అంటే నేను కొనిపెట్టగలను కానీ నాన్న పని చేసిన చోటు చూపించమంటే నేనెలా తీసుకెళ్ళగలను??? కానీ అడిగింది నా చెల్లి.. తన మాట నేనెప్పుడైనా కాదన్నానా?? కనీసం సాయం చెయ్యటానికి భందువులు కూడా ఎవ్వరూ లేరు. మాకు తెలిసిన ఒకే ఒక్క పెద్ద దిక్కు నాన్న స్నేహితుడు, సహోద్యోగి అయిన మిలిటరి మావయ్య.. అవును మరి ఎప్పుడు మా దగ్గరకి వచ్చినా మేము మావయ్యా అని పిలుస్తామే కానీ పేరు తెలియదాయె. మరి ఇప్పుడు ఎలా?? ఎవరిని అడగాలి?? అని ఆలోచిస్తుండగా నాకు నాన్న personal diary దొరికింది. తెరిచి చూస్తే అన్నీ వివరాలు అందులో ఉన్నాయి. నాన్న పనిచేసిన చోటు, చిరునామా. నాన్న మమ్మల్ని ఎంత ఇష్టపడే వారో ఆ dairyని చదివితే తెలుస్తుంది. మేమంటే ఆయనకు పంచ ప్రాణాలు. ఇంక మరుసటి రోజునే నేను చెల్లిని తీసుకొని బయలుదేరాను... నా దగ్గర ఉన్న కొంచం డబ్బులు తీసుకొని, సంచిలో తినటానికి కొన్ని, చేరి రెండు జతల బట్టలు పెట్టుకొని మేము ఇద్దరం 'little soldiers' లాగా బయలుదేరాము. ఒక్కటే లక్ష్యం. ఎలాగైనా నాన్న పని చేసిన చోటు చూడాలి. తన కుర్చీలో చెల్లిని ఒక సారి కుర్చోబెట్టాలి. చెల్లి కళ్ళల్లో ఆనందం చూడాలి.
ఇంక దారిలో ఉహించిన విధంగానే ప్రమాదాలు, అవాంతరాలు. ఒక సారి దాదాపుగా చెల్లి తప్పిపోయి ఉండేది. ఆ బస్సు driver సహాయంతో ప్రమాదం తప్పింది. ఇంకొక చోట మా దగ్గర ఉన్న డబ్బులు అయిపోతే ఏం చెయ్యాలో తెలియని స్థితిలో, చెల్లికి ఆహారం కూడా కొనలేకపోతాను. అప్పుడు నా పక్కన ఉన్న పెద్దాయన్ని చూస్తే తను మాకంటే దిగులు చెంది ఉన్నట్లు కనిపించింది. ఎందుకో పాపం! ఆయన మా పరిస్థితి విని మాకు డబ్బులు ఇవ్వబోతే నేను తీసుకోలేదు. అయన పట్టు విడవలేదు. సరే ముందు అయన ఎందుకు భాద పడుతున్నాడో అని అడగగా తన సమస్య నాకు చిన్నదిగా కనిపించింది. తన వ్యాపారం మళ్ళి బాగుపడాలి అంటే ఏం చెయ్యాలో ఆయనకి ఒక చిట్కా చెప్పను.(కొన్ని సార్లు అంతే చిన్న చిన్న విషయాలు మనం ఎంతగా పరిగణలోకి తీసుకోమో ఇలాంటి విషయాల వల్ల తెలుస్తుంది) ఆయనకు ఆ చిట్కా నచ్చి మమ్మల్ని మెచ్చి మాకు remuneration ఇచ్చాడు. ఒకరికొకరం all the best చెప్పుకొని వీడ్కోలు తీసుకున్నాం. అలా ఎన్నో సమస్యలు, భాదలు పడుతూ చివరికి నేను చెల్లిని నాన్న పనిచేసిన చోటికి తీసుకెళ్ళగలిగాను. ఆఫీసు పరిసరాల్లో మిలటరీ మావయ్య కనిపించటంతో మా పని సులువుగా అయ్యింది. ఆ రోజు చెల్లి మోహంలో చుసిన ఆనందం నాకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది.
ఇదీ నాకు ఇవాళ వచ్చిన కల. It shows how badly I miss my little sister.
నిజానికి నాకు చెల్లెలు లేదు. నేను మా అన్నయ్య. ఈ అమ్మాయి నా cousin. ఇలా నాకు ఒక చెల్లి ఉంది అని నాకు తెలిసింది ఎప్పుడో తెలుసా?? నేను engineering మూడోవ సంవత్సరంలో ఉన్నప్పుడు. పరిచయమయ్యిన కొన్ని రోజులకే మేము ఎన్నో రోజులనుంచి పరిచయం ఉన్న వాళ్ళ లాగా తయారయ్యాం... Hutch వాడి పుణ్యమాని రోజుకు ఒక్క రూపాయితో free sms option ఉండే రోజులవి. ఇంకేముంది, తు అంటే sms న అంటే sms :) మేము అవ్వటానికి భందువులమే అయినా స్నేహితులు లాగా ఉంటాము. తర్వాత తర్వాత నా స్నేహితులు తన స్నేహితులు అయ్యారు. తన స్నేహితులు నా స్నేహితులు అయ్యారు. అక్కడ cut చేస్తే తను MBA చెయ్యటానికి హైదరాబాదు రావటం, నేను ఉద్యోగానికి అదే ఊరు రావటం జరిగింది. ఇంకేముంది, మీరు ఉహించేదే. weekendsకి సినిమాలు. బోర్ కొడితే long driveలు. సొంత అన్నా చెల్లెళ్ళ లాగా ఉంటాము. And then comes the inevitable. తన MBA course అయిపొయింది. ఇంటికి వెళ్ళిపోయింది. వాఆఆఆఅ :(
నేను చెన్నై వచ్చాను. మరీ చెల్లి దూరమైందని మందు కొడితే బాగోదు అని సాంబారు తాగుతూ బతికేస్తున్నాను. :) అప్పడప్పుడు వీలు చూసుకొని చిన్న చిన్న trips వేసుకుంటాము. అలా ఒక సారి మహాబలిపురం వెళ్తే.. ఇంకో సారి భద్రాచలం వెళ్ళాము. కానీ మా చిన్ని చిన్ని పోట్లాటలు, సరదా సరదా ప్రయాణాలు, చక్కని సంభాషణలు, నాకు అన్నం తినిపించిన సమయాలు, Dairymilk Silk కొనిపెడితే తన కళ్ళల్లోని ఆనందం ఇలాంటి ఎన్నో జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికి, ఎప్పటికీ పదిలంగా ఉంటాయి.
ఇంతకీ మీకు తన పేరు చెప్పలేదు కదా... సంపూర్ణ... సంపూర్ణ లక్ష్మీ.
ఊరు- విశాఖపట్నం.

అబ్బ మొదటి భాగం చూసి నిజమేనేమో అనుకుని ఆశ్చర్యపోతూ చదివాను.
ReplyDeleteమంచి హుషారుగా ఉందే మీ చెల్లెలు :)
మీ అన్న-చెల్లెళ్ళ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా!
మొదటి భాగం కేవలం సినిమాలు కలలలో మాత్రమే జరుగుతుంది సౌమ్య గారు... :)
ReplyDeleteNice !
ReplyDeleteపోస్ట్ బిగినింగ్ లో కధ రాశావేమో అనుకున్నా.. ఆ తర్వాత నిజమేమో అనిపించింది... తర్వాత రీసెంట్గా చదివిన నవల రివ్యూనేమో అనుకున్నా..
ReplyDeleteఫైనల్ గా ట్విస్ట్ ఇచ్చావు ;) నైస్ పోస్ట్
హహహ.. అవునా రాజ్..
Deleteట్విస్ట్ నచ్చిందా??
Double likes...
ReplyDeleteDouble likes...
ReplyDeletethanks sis...
ReplyDelete:))
Deletenice :)
ReplyDeletedidn't know that you have a blog !!
ReplyDeleteit has been nine months since your last post, keep writing bud :)
Yeah Nagarjuna.. It has been a while now.. I should keep writing.. will try to do..
Deletethanks